కలం, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) దమ్ముంటే తాను పార్టీ మారినట్లు ధైర్యంగా ఒప్పుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ (KP Vivekanand) సవాల్ విసిరారు. కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని కేపీ వివేకానంద్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై నేడు స్పీకర్ విచారణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వివేకానంద్ మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి నిజంగా దమ్మున్నోడు అయితే పార్టీ మారాను అని ధైర్యంగా చెప్పాలని, అలా చెప్పకుండా నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.
మున్సిపాలిటీ ఎన్నికల్లో (Municipal Elections) ఒకపక్క కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తూనే బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి కూతురే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారన్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటానని, దేనికైనా సిద్ధమేనని ప్రకటించిన కడియం శ్రీహరి మళ్లీ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని చెప్పుకుంటున్నారని నిలదీశారు. రాజకీయంలో సుధీర్ఘ అనుభవం ఉండి, ఎన్నో పదవులు చేపట్టిన కడియం శ్రీహరికి ఇలా ప్రవర్తించడం తగదని వివేకానంద్ (KP Vivekanand) వ్యాఖ్యానించారు.
Read Also: వరంగల్ మున్సి‘పోల్స్‘లో చిత్రవిచిత్రాలు.. ఓట్ల కోసం నేతల ఫీట్లు
Follow Us On: Youtube


