Mobile Popup Ad
Mobile Popup Ad

లాస్ట్ మినిట్ లో ట్విస్ట్ ఇచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి

కలం, నల్లగొండ బ్యూరో : చౌటుప్పల్ (Choutuppal) మున్సిపాలిటీలో హైడ్రామా కొనసాగుతోంది. బీ-ఫామ్ తీసుకునే టైమ్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని మహేశ్వరి ఇచ్చిన ట్విస్ట్ నియోజకవర్గంలో చర్చకు దారితీసింది. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున 17వ వార్డు అభ్యర్థిగా చింతల ఉమామహేశ్వరి బీ ఫామ్ అందుకున్నారు. అయితే అంతకుముందే కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తిని ఆ పార్టీ నేతలు విత్‌డ్రా చేయించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఆ వార్డులో అభ్యర్థి లేకుండా పోయారు. దీంతో తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లీడర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో చౌటుప్పల్ మున్సిపల్ ఆఫీస్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>