కలం, వెబ్ డెస్క్: అసియాలో అతిపెద్ద మేడారం జాతర (Medaram Jatara) విజయవంతమైందని మంత్రి సీతక్క (Minister Seethakka) వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో మేడారం జాతరపై చిట్‌చాట్ నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై కొందరు విషప్రచారం చేశారని విమర్శించారు. భక్తుల సౌకర్యాలకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేయడంతోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని మంత్రి సీతక్క గుర్తుచేశారు. క్లాస్, మాస్‌తో పాటు హైక్లాస్ పీపుల్ కూడా జాతరకు భారీగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో తిరుగు జాతర కూడా ప్రారంభంకానుందని, అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయని సీతక్క తెలిపారు.
మేడారం జాతర నిర్వహణలో అనేక లోపాలున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. భద్రత, ట్రాఫిక్, ఇతర సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏర్పాట్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క (Minister Seethakka) పైవిధంగా స్పందించారు.
Read Also: సీఎం ఇంట స్పెషల్ డిన్నర్.. రాజకీయ వ్యూహమేంటి?
Follow Us On: Youtube


