కలం, డెస్క్ : జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ వ్యక్తే అని.. అతను కాంగ్రెస్ నేత కాదన్నారు. ‘జగిత్యాలలో కాంగ్రెస్ అసలైన నాయకులకు, వసల వాదులకు మధ్య పోటీ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తెలియని పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే సంజయ్ అభ్యర్థుల లిస్టును పరిశీలించడం ఏంటి. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అయిన సంజయ్ ను గాంధీ భవన్ కు పిలిచి క్రమశిక్షణ తప్పింది ఎవరు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం కోసం మేం పనిచేస్తుంటే ఎమ్మెల్యే సంజయ్ తెరవెనక రాజకీయం చేస్తున్నారు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు జీవన్ రెడ్డి.
Read Also: KCR ఎంక్వయిరీ టైమ్‌లో సంతోష్ లేడెందుకు? బీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చ
Follow Us On: Sharechat


