epaper
Wednesday, February 18, 2026
epaper

ట్రేడ్​ డీల్​తో రైతుల కష్టం అమెరికాకు తాకట్టు : రాహుల్​

కలం, వెబ్​డెస్క్​: అమెరికాతో ట్రేడ్​ డీల్​ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజీ పడ్డారని​ లోక్​సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. భారత్​పై విధించిన టారిఫ్స్​ను 25శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తూ సోమవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం పార్లమెంట్​ ఆవరణలో రాహుల్​ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

‘కొన్ని నెలలుగా నిలిచిపోయిన ట్రేడ్​ డీల్ హఠాత్తుగా రాత్రికి రాత్రే కుదిరింది. ప్రధాని మోదీపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఆయన కంగారు పడ్డారు. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనకు ఒక ఇమేజ్​ను ఆపాదించారు. ఇప్పుడు దాన్ని బద్దలు కొడుతున్నారు. కారణం.. అమెరికాలో అదానీపై ఒక కేసు ఉంది. నిజానికి అది మోదీజీపైనా ఉంది. అలాగే ఎప్​స్టీన్​ ఫైల్స్​లో అమెరికా విడుదల చేయని చాలా విషయాలు ఉన్నాయి. ఈ రెండిటి వల్లే మోదీజీపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిలోనే రాజీపడ్డారు. ఒప్పందం కుదుర్చుకొని, దేశాన్ని, రైతుల కష్టాన్ని తాకట్టు పెట్టారు’ అని రాహుల్ (Rahul Gandhi)​ అన్నారు.

కాగా, అంతకుముందు లోక్​సభలో రెండో రోజూ ఆర్మీ మాజీ చీఫ్​ నరవణే జ్ఞాపకాల ఆత్మకథలోని పుస్తకంలోనివిగా చెబుతున్న మాటలపై గందరగోళం చెలరేగింది. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం సమయంలో రాహుల్​ మరోసారి నరవణే మాటలున్న మ్యాగజైన్​ను ప్రదర్శిస్తూ, ఆ అంశంలపై మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల దాడి కొనసాగడంతో సభ వాయిదా పడింది. ఈ అంశంపైనా పార్లమెంట్​ ఆవరణలో రాహుల్​ మాట్లాడారు. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం తెలిపే విషయంలో ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వకపోవడం పార్లమెంట్​ చరిత్రలోనే మొదటిసారని రాహుల్​ వ్యాఖ్యానించారు.

Read Also: పార్లమెంట్ లో విపక్ష ఎంపీల సస్పెన్షన్​..

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>