epaper
Wednesday, February 18, 2026
epaper

అంబటి, జోగి రమేశ్‌లను పరామర్శించనున్న జగన్

కలం, వెబ్ డెస్క్ : ఇటీవల వైసీపీ మాజీ మంత్రుల ఇంటిపై టీడీపీ శ్రేణుల  వరుస దాడులు చేసిన నేపధ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం  ఏర్పాటు చేసిన జగన్.. జరిగిన ఘటనలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అలాగే దాడి జరిగిన అంబటి, జోగి రమేశ్ ల ఇళ్ళకి వెళ్ళాలని  జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన గుంటూరు వెళ్లనున్న జగన్ అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

అలాగే శుక్రవారం కృష్ణ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ (Jogi Ramesh) నివాసానికి జగన్ వెళ్లనున్నారు. ఆ  తరువాత భారీ నిరసన కార్యక్రమం  నిర్వహించి ప్రతిపక్ష పార్టీపై ప్రభుత్వ క్రూర చర్యల గురించి తీవ్ర  నిరసన తెలుపనున్నట్లు సమాచారం. అయితే జగన్ (YS Jagan) సాధారణ పర్యటనకే భారీగా జన సమీకరణ ఉంటుంది. ఇప్పుడు భారీ నిరసన కార్యక్రమం చేపట్టుతుండటంతో ఈ సారి భారీగా పోలీసు బందోబస్తు అవసరం కానుంది. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, నాయకులు జగన్ పర్యటనకై భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ భారీ నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

Read Also: మద్యం దుకాణ యజమానులపై పవన్ ఆగ్రహం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>