epaper
Monday, February 2, 2026
spot_img
epaper

సీపీ సజ్జనార్‌కు కేటీఆర్ కౌంటర్

కలం, వెబ్ డెస్క్ :  ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ (KCR) విచార‌ణ‌పై సిట్ చీఫ్ స‌జ్జ‌నార్ (Sajjanar) ఎక్స్ వేదిక‌గా చేసిన పోస్ట్ తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. దీనిపై బీఆర్ఎస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇల్లీగ‌ల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచార‌ణ పూర్త‌య్యింద‌ని స‌జ్జ‌నార్ త‌న పోస్టులో పేర్కొన‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స‌జ్జ‌నార్ పోస్ట్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు.

మీకు మీరే న్యాయమూర్తి అనుకొని తీర్పు చెప్తున్న‌ట్లు ఉందంటూ క‌మిష‌న‌ర్‌పై సెటైర్ వేశారు. అనుమానిత కేసుపై మీ అధ్య‌క్ష‌త‌న ఓ బృందం విచార‌ణ చేస్తుంది, ఆ కేసు నిజ‌మా? కాదా? అనేది చివ‌ర‌కు కోర్టులోనే నిరూపించాల్సి వ‌స్తుంద‌ని సీపీకి సూచించారు. కేసుపై ముందుగానే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి ఇలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయ‌డం స‌రికాద‌న్నారు. అధికారం దుర్వినియోగం చేసేలా కనిపిస్తున్న ఈ చర్యలను న్యాయస్థానాలు గమనిస్తున్నాయ‌ని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు.

 Read Also: కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>