కలం, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli )కాంబినేషన్లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ ” వారణాసి” (Varanasi). దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ నిర్మాణంలో ఈ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ ఎంతో అట్టహాసంగా నిర్వహించిన రాజమౌళి గ్లింప్స్‌తోనే సినిమాపై భారీగా అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించడంతో ఫ్యాన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే వారణాసి (Varanasi) సినిమా షూటింగ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. తరువాత షెడ్యూల్‌ను జార్జియాలో నిర్వహించనున్నట్లు సమాచారం. దర్శకుడు రాజమౌళి ఇప్పటికే జార్జియా షూటింగ్ కు సంబంధించి పనులన్నీ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. అలాగే అంటార్కిటికాలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


