కలం, మెదక్ బ్యూరో: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy)పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారని ఎమ్మెల్యేతోపాటు పలువురు బీఆర్ఎస్ (BRS) నాయకులపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో పార్టీ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంలో సునీత లక్ష్మారెడ్డి పాల్గొంది.


