epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

‘ఎప్​స్టీన్​ ఫైల్స్’​లో క్రీడా దిగ్గజాలు!

కలం, వెబ్​డెస్క్​: ప్రపంచవ్యాప్తంగా ఎప్​స్టీన్​ సెక్స్​ స్కాండల్ (Epstein Files)​ మరోసారి కలకలం సృష్టించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్​ను అమెరికా ప్రభుత్వం దఫాదఫాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలో శనివారం మరోసారి ఎప్​స్టీన్​ ఫైల్స్​ను సుమారు లక్షకు పైగా పత్రాలు, ఫొటోలను పబ్లిక్​ ప్లాట్​ఫామ్​లోకి రిలీజ్​ చేసింది. ఇందులో ట్రంప్​ పేరు కొన్ని వందల సార్లు ప్రస్తావించింది. అలాగే బిల్​గేట్స్​, మస్క్​ పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఇటీవలే న్యూయార్క్​కు మొదటి ముస్లిం మేయర్​గా ఎన్నికైన జోహ్రాన్​ మమ్​దానీ అమ్మ, భారతీయ దర్శకురాలు మీరా నాయర్​ పేరు కూడా ఉంది. ప్రస్తుత ఎప్​స్టీన్​ ఫైల్స్​లో రాజకీయ, సినీ, వ్యాపార వేత్తలతోపాటు క్రీడా దిగ్గజాల పేర్లు ఉండడం గమనార్హం.

సచిన్​, మెస్సీ, బెక్​హామ్​:

భారత క్రికెట్​ దిగ్గజం టెండూల్కర్ (Sachin Tendulkar)​తో పాటు ఫుట్​బాల్​ లెజెండ్స్​ డేవిడ్​ బెక్​హామ్​, లియోనల్​ మెస్సీ పేర్లు ఎప్​స్టీన్​ ఫైల్స్​లో కనిపించాయి. వీళ్ల పేర్లు ఎప్​స్టీన్​ ఫైల్స్​ (Epstein Files)లోని ‘మోస్ట్​ అడ్మైర్డ్​’ విభాగంలో ఉన్నాయి. కాగా, ఫుట్​బాల్​ దిగ్గజం, అర్జెంటీనా ఆటగాడు మెస్సీ (Lionel Messi) ఇటీవల భారత పర్యటనకు వచ్చి, హైదరాబాద్​ను కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. ఇక, ఇంగ్లాండ్​ ఫుట్​బాల్​ ఆటగాడు డేవిడ్​ బెక్​హామ్​​, మెస్సీ​ కలసి ఇంటర్​ మియామి క్లబ్​ తరఫున ఫుట్​బాల్​ ఆడారు.

మైఖేల్​ జోర్డాన్​, టైగర్​ వుడ్స్​:

వీళ్లిద్దరూ బాక్సెట్​ బాల్​, గోల్ఫ్​లో గ్రేటెస్ట్​ ఆఫ్​ ఆల్​ టైమ్​(గోట్​) అని పేరు పొందిన ఆటగాళ్లు. ఇందులో టైగర్​ వుడ్స్​ పేరు ఎప్​స్టీన్​ ఈ మెయిల్స్​లో ఉన్నట్లు తేల్చారు. ఇక, జోర్డాన్​ పేరు.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ప్రెసిడెన్షియల్ మెడల్​ తీసుకుంటున్నప్పుడు, ఎప్​స్టీన్​ సమక్షంలో ఉన్నట్లు పేర్కొన్నారు.

‘ఎప్​స్టీన్​ ఫైల్స్’​లో పేరున్నంత మాత్రాన వారందిరీకీ ‘ఎప్​స్టీన్​’ నేరాలలో భాగం ఉన్నట్లు కాదని, అమెరికా ప్రభుత్వ స్పష్టం చేసింది. కాగా, అమెరికా సమీపంలోని ఓ దీవిలో మైనర్లు, మహిళలను పావుగా వాడుకొని వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులతో ఎప్​స్టీన్​ అనే వ్యాపారవేత్త తనకు కావాల్సిన పనులు చేయించుకున్నట్లు వెల్లడవడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Read Also: టీ20 వరల్డ్‌కప్ 2026: పాకిస్థాన్ ఎంట్రీపై ఉత్కంఠ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>