కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) వేదికపై పాకిస్థాన్ (Pakistan) సందిగ్దంలో పడింది. తాజా సమాచారం ప్రకారం, టోర్నీలో పాల్గొనాలా వద్దా అనే తుది నిర్ణయాన్ని PCB ఆదివారం తీసుకోనుంది. ఈ వరల్డ్‌కప్ భారత్ (India), శ్రీలంక (Sri Lanka) సంయుక్తంగా నిర్వహించనున్నాయి. పాకిస్థాన్ గ్రూప్ ఏలో భారత్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికాతో ఉంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7న కొలంబోలో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది.
అయితే పాల్గొనకపోతే ప్రత్యామ్నాయంగా ‘ప్లాన్ బీ’ (Plan B) ని PCB సిద్ధం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. సీనియర్ జట్టు, పాకిస్థాన్ షాహీన్స్, అండర్-19 జట్లను నాలుగు జట్లుగా విభజించి లాహోర్ గద్దాఫీ స్టేడియంలో దేశవాళీ టోర్నీ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో వరల్డ్‌కప్ (T20 World Cup) కిట్ విడుదలను కూడా తుది నిర్ణయానికి అనుసంధానం చేశారు. జనవరి 31న కిట్ ఆవిష్కరణ జరగాల్సి ఉండగా, ఇప్పుడు అది అనిశ్చితంగా మారింది.
ఈ అంశంపై PCB చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఇవాళ సాయంత్రం ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిసిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ICC పరిణామాల నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం.
Read Also: ‘ఎప్స్టీన్ ఫైల్స్’లో క్రీడా దిగ్గజాలు!
Follow Us On: Sharechat


