కలం, వెబ్ డెస్క్: డీసీసీ అధ్యక్షులంతా కేసీఆర్ సిట్ విచారణ అంశంపై తక్షణమే స్పందించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) సూచించారు. కేసీఆర్(KCR)కు సంబంధించిన సిట్ (SIT) విచారణ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని డీసీసీ (DCC) అధ్యక్షులు తప్పకుండా ఈ అంశంపై స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, ప్రజాధన దుర్వినియోగంపై సిట్ విచారణ జరుగుతుండటం ప్రజాస్వామ్యానికి, చట్టపాలనకు అనుకూలమని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చట్టం ముందు అందరూ సమానమే అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉందని, నిజాలు బయటపడాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సిట్ విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు, రాజకీయ ఒత్తిళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని డీసీసీ అధ్యక్షులు ఖండించాలని, కాంగ్రెస్ పార్టీ వైఖరిని బలంగా ప్రజల ముందుంచాలని ఆయన (TPCC Chief) సూచించారు.
Read Also: విచారణలు రాజకీయ వేధింపులు కాదు : మంత్రి కొండా సురేఖ
Follow Us On: Sharechat


