కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న విచారణలు రాజకీయ వేధింపులు కాదని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఏదులాపురంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు కొత్తవేం కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే కక్ష్య సాధింపు రాజకీయాలు ఉండేవని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల మేరకే నడుచుకుంటుందని చెప్పారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. ప్రభుత్వం కావాలని ఎవరిపైనా బురద చల్లదని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పు చేయకపోతే సిట్ అడిగే ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు చెప్పాలన్నారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో కావాలనే నోటీసులు ఇచ్చారనే ప్రతిపక్షాల విమర్శలను ఆమె తిప్పికొట్టారు. విచారణ సంస్థలకు, ఎన్నికల షెడ్యూల్ కు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. ఆధారాలు సేకరించిన తర్వాతే అధికారులు తమ పని ప్రారంభిస్తారని తెలిపారు. రాజకీయ లబ్దికోసం విచారణలను అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. విచారణలు ఎదుర్కోవడానికి బదులు నిరసనలు, ఆందోళనలు చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూడడం సరికాదని మంత్రి హితవు పలికారు. కేసీఆర్ కుటుంబం ఏ తప్పు చేయకపోతే విచారణకు సహకరించి వాస్తవాలను బయటపెట్టాలని ఆమె (Konda Surekha) డిమాండ్ చేశారు.
Read Also: కేసీఆర్ సెంటిమెంట్ డ్రామా జనం నమ్మరు: మహేష్ కుమార్ గౌడ్
Follow Us On: Pinterest


