కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం బాలికలకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర బడ్జెట్ (Union Budget) 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బాలికల విద్య, భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రతి జిల్లాకు ఓ బాలికల హాస్టల్
దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఓ బాలికల హాస్టల్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. బాలికల భద్రత, సంరక్షణే లక్ష్యంగా ఈ హాస్టళ్లను నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 800 జిల్లాల్లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బాలికల హాస్టళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్లకు దూరంగా ఉన్న పట్టణాల్లో చదువుకోవాలనుకునే అమ్మాయిలకు సురక్షితమైన వసతి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది. 12వ తరగతి తర్వాత చాలా మంది అమ్మాయిలు భద్రత, ఆర్థిక కారణాల వల్ల చదువు మానేస్తున్నారు. దీనిని అరికట్టి, ఉన్నత విద్యలో వారి సంఖ్యను 50 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఏయే వసతులు ఉంటాయి?
హాస్టళ్లలో హై-స్పీడ్ ఇంటర్నెట్, లైబ్రరీ, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు కూడా ఉండబోతున్నాయి. ఇప్పటికే 2 కోట్ల మంది మహిళలు ‘లఖ్పతీ దీదీలు’ అయ్యారని, త్వరలో ఆ సంఖ్యను 3 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. గ్రామీణ మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ముద్రా లోన్ల పరిమితి పెంపు, ప్రత్యేక సబ్సిడీలపై ఫోకస్ చేశారు.
Read Also: విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్..
Follow Us On: Sharechat


