కలం, వెబ్ డెస్క్ : న్యూజిలాండ్ (New Zealand) తో జరిగిన ఐదో టీ20లో తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) చెప్పుకొచ్చాడు. కెమెరా ముందు ముఖంపై నవ్వుతో కనిపించినా లోపల మాత్రం పెద్ద తుఫానే చెలరేగుతున్న ఫీల్ కలిగిందని వివరించాడు. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని వెల్లడించాడు. తిరువనంతపురంలో జరిగిన ఐదో టీ20 అనంతరం తన ప్రదర్శనపై స్పందిస్తూ, బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవడమే ప్రస్తుతం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 46 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ఐదు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. అయితే వ్యక్తిగతంగా మంచి ప్రదర్శన చేసినా, ఇంకా పరిపూర్ణమైన టీమ్ గేమ్ రాలేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇటీవల పరుగులు ఎక్కువగా ఇస్తున్న నేపథ్యంలో, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సహాయంతో మ్యాచ్‌పై నియంత్రణ సాధించే దిశగా పని చేస్తున్నట్లు తెలిపాడు.
న్యూజిలాండ్ (New Zealand) బ్యాటర్లు దూకుడుగా ఆడతారని ముందే అంచనా వేసినట్టు అర్ష్‌దీప్ చెప్పాడు. పవర్‌ప్లే అనంతరం టీమ్ హడిల్‌లో బాడీ లాంగ్వేజ్‌పై చర్చ జరిగిందని, ప్రత్యర్థిని 180 పరుగులలోపే కట్టడి చేయాలన్న లక్ష్యంతో బౌలింగ్ చేసినట్లు వివరించాడు. ఫిన్ అలెన్ (Finn Allen) కొన్ని షాట్లు ఆకట్టుకున్నప్పటికీ, తన బౌలింగ్ ప్లానింగ్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని భావించినట్టు పేర్కొన్నాడు.
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. అలెన్ హాఫ్ సెంచరీ చేసినా ఫలితం దక్కలేదు. అర్ష్‌దీప్‌కు అక్షర్ పటేల్ మంచి మద్దతు ఇచ్చాడు. ఈ విజయం టీమిండియాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని, మిగిలిన లోపాలను భవిష్యత్ టోర్నీలకు ముందు సరిదిద్దుకునే అవకాశం కల్పించిందని భావిస్తున్నారు.


