కలం, వెబ్ డెస్క్ : ఆధ్యాత్మిక నగరం తిరుపతి (Tirupati) లో మందుబాబులు హల్చల్ చేశారు. నడి రోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. కేశవాయనగుంటలో రోడ్డుపైనే కారు ఆపి మందు తాగుతూ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారు. కారు పక్కకు తీయుమని చెప్పినందుకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తున్న రోగి కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా వాళ్లపూ మందుబాబులు కారు ఎక్కించారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


