epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

మరి కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

క‌లం, వెబ్‌ డెస్క్‌: కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman) మ‌రి కాసేప‌ట్లో లోక్‌స‌భ‌లో 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి కేంద్ర బ‌డ్జెట్(Union Budget) ప్రవేశ పెట్ట‌నున్నారు. వ‌రుస‌గా తొమ్మిదో సారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఆర్థిక‌మంత్రిగా నిర్మ‌లా సీతారామ‌న్ రికార్డు సృష్టించ‌నున్నారు. మ‌రోవైపు 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నిర్మలా సీతారామ‌న్‌ ఆరేళ్ల‌కు పైగా నిరంత‌రాయంగా ఆర్థిక మంత్రిగా ప‌ని చేసి మ‌రో రికార్డు త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇక‌ దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆదివారం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డం తొలిసారి కావ‌డం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. మ‌రో వైపు ఆదివారం సెల‌వు రోజు అయిన‌ప్ప‌టికీ స్టాక్ మార్కెట్లు ప‌ని చేస్తున్నాయి. బ‌డ్జెట్‌పై భారీ అంచ‌నాలున్నాయి. సుంకాలు, ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌ట్టుకొని దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిరంగా ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. త్వ‌ర‌లో ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కేటాయింపుల్లో ఆయా రాష్ట్రాల‌కు ఇవ్వ‌నున్న ప్రాధాన్య‌త చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>