epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

కవలలకు జన్మనిచ్చిన రామ్​ చరణ్​, ఉపాసన దంపతులు

కలం, వెబ్​ డెస్క్​ : మెగా పవర్​ స్టార్ రామ్​ చరణ్ (Ram Charan Konidela), ఉపాసన (Upasana) దంపతులు కవలలకు జన్మనిచ్చారు. ఒక పాప, ఒక బాబు జన్మించారని మెగాస్టార్​ చిరంజీవి ఎక్స్​ వేదికగా హ్యాపీ మూమెంట్స్ పంచుకున్నారు. రామ్​ చరణ్​, ఉపాసన దంపతులు శనివారం కవల పిల్లలకు స్వాగతం పలికారని తెలిపారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారన్నారు. అందరి ప్రార్థనలు, ప్రేమ, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఉపాసనకు ఇది రెండో కాన్పు. 2023 జూన్​ 20న మొదటి కాన్పులో ​క్లింకారా జన్మించారు. శనివారం రెండో కాన్పులో ట్విన్స్ కు జన్మనిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>