epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

మినీ బడ్జెట్ తెలుసా.. ఎందుకు, ఎన్ని సార్లు పెట్టారు?

కలం, తెలంగాణ బ్యూరో: సాధారణంగా ‘పూర్తి స్థాయి బడ్జెట్’, ‘మధ్యంతర బడ్జెట్’ అనేవే ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. కానీ, ప్రత్యేక సందర్భాల్లో కూడా బడ్జెట్ పెడ్తూ ఉంటారు. దాన్ని మినీ బడ్జెట్ లేదా స్పెషల్ బడ్జెట్ అంటారు. స్వతంత్ర భారతావనిలో 1947లో మొదలైన బడ్జెట్ ల ప్రస్తానంలో 2025 ఫిబ్రవరి 1తో కలిపి 94 సార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఇందులో పూర్తి స్థాయి 75, మధ్యంతర 15 బడ్జెట్ లు ఉన్నాయి. 4 సార్లు మినీ బడ్జెట్ (Mini Budget) కూడా వచ్చింది. 1956 నవంబర్ 30 మొదటి మినీ బడ్జెట్ ను టీటీ కృష్ణమాచార్య (TT Krishnamachari) ప్రవేశపెట్టారు. అప్పట్లో విదేశీ మారక నిల్వల కొరత ఏర్పడటం, దాన్ని అధిగమించడానికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వంటి కొత్త పన్నులు తేవడానికి దీన్ని ముందుంచారు.

1971లో పాక్తో యుద్ధం కారణంగా మినీ బడ్జెట్ (Mini Budget) వచ్చింది. వార్ తో పెరిగిన ఖర్చులను భరించడానికి దీన్ని వై.బి.చవాన్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1974లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి.. 1990లో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి మినీ బడ్జెట్ లు వచ్చాయి.

Read Also: సునేత్ర అజిత్ పవార్ కు శాఖల కేటాయింపు..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>