epaper
Saturday, January 31, 2026
spot_img
epaper

గ్రూప్ ​– 1 తుది జాబితా విడుదల చేసిన ఏపీపీఎస్సీ

కలం, వెబ్ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ గ్రూప్​ – 1 (APPSC Group 1) ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. 89 ఉద్యోగాల భర్తీకి 2023లో నోటిఫికేషన్​ గతేడాది పరీక్షలు జరిగాయి. 2025 జూన్​ 23 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ క్రమంలో ఫలితాల ప్రకటన వేళ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టులో పిటిషన్​ దాఖలయింది. అయితే, రిజర్వేషన్​ రోస్టర్ పై న్యాయస్థానం స్టే ఇవ్వకపోవడం, ఆదేశాలకు లోబడి ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో తుది జాబితాకు సంబంధించిన వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. కమిషన్ వెబ్​ సైట్ లో ఏపీపీఎస్సీ ఫలితాలు పొందుపరిచింది. న్యాయస్థానం ఆదేశాలతో స్పోర్ట్స్ కోటాలోని రెండు పోస్టుల ఫలితాలను నిలిపివేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>