కలం, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి సినిమా రిలీజ్ డేట్ (Varanasi Release Date) వచ్చేసింది. సోషల్ మీడియా వేదికగా రాజమౌళి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. 2027 ఏప్రిల్ 7 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీ రామాయంలోని ఓ ఘట్టం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ రాజమౌళి గతంలోనే ప్రకటించారు.
Read Also: లొంగకపోతే నో ఛాన్స్.. క్యాస్టింగ్ కౌచ్‌పై తమ్మారెడ్డి కామెంట్స్
Follow Us On: X(Twitter)


