కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ (Food poison) కలకలం సృష్టించింది. పాఠశాలలోని 40 మంది విద్యార్ధులు మధ్యాహ్నం భోజనం చేశారు. తర్వాత ఒక్కసారిగా 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్తో ఇబ్బందిపడిన విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే సంజీవ రెడ్డి (Sanjeeva Reddy) పరామర్శించారు.


