epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

మైక్రో బ్రూవరీల పాపం మీదే.. బీఆర్ఎస్‌పై జూపల్లి ఫైర్!

కలం, వెబ్ డెస్క్: మైక్రో బ్రూవరీకి సంబంధించిన కీలక విషయాలను మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally) వెల్లడించారు. బుధవారం ర‌వీంద్రభారతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మైక్రో బ్రువ‌రీకి సంబంధించి 28 ఆగ‌స్టు 2015లో జీవో నంబ‌ర్ 151 జారీ చేస్తూ.. మైక్రో బ్రూవ‌రీల ఏర్పాటుకు రూల్స్ ఫ్రేం చేశారని, ఆ జీవో ప్రకారం 1 జూలై 2016న ప్రభుత్వం మెమో నంబ‌ర్ 24367 ఇస్తూ మొత్తం 20 బ్రూవ‌రీల‌కు అనుమ‌తిని ఇచ్చారని తెలిపారు. 50 ద‌ర‌ఖాస్తులు వ‌స్తే 20కి మాత్రమే అనుమ‌తులు ఇచ్చారని, వాటికి ఎలాంటి లాట‌రీ పద్ధతి పాటించ‌లేదని జూపల్లి తెలిపారు.

‘‘మేం ఈ రెండేళ్లలో బ్రూవరీలకు సంబంధించి. కొత్త చట్టం తేలేదు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయి కదా? మెక్రో బ్రూవ‌రీల‌కు సంబంధించి అనుమ‌తుల కోసం నావద్దకు ఎలాంటి ఫైళ్లు రాలేదు. సంబంధిత శాఖకు ద‌ర‌ఖాస్తులు మాత్రమే వ‌చ్చాయి. కొత్త బ్రూవరీలకు దరఖాస్తులు వస్తే.. ఆయా సంస్థలకు ఉన్న భూ లభ్యత, మౌలిక వసతులపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే, అప్పుడు వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని జూపల్లి అన్నారు.

‘‘అవ‌గాహ‌న రాహిత్యంతో హ‌రీష్ రావు (Harish Rao) బుర‌ద‌జ‌ల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో 105 ఎలైట్ బార్లకు అనుమతి ఇచ్చారు. 2016 – 2023 వ‌ర‌కు ఏ ప్రతిపాదిక‌న అనుమ‌తులు ఇచ్చారు. లాటరీ ద్వారా కాకుండా మీకు న‌చ్చిన వారికి అనుమ‌తులు ఇచ్చింది వాస్తవం కాదా? త‌ప్పుల‌న్ని మీరు చేసి మాపై బుర‌ద‌జ‌ల్లుతున్నారు ప్రతి 15 రోజులకు బకాయిలు చెల్లిస్తే.. మీ ప్రభుత్వ హయాంలో 3,500 కోట్లు ఎక్సైజ్ శాఖలో ఎలా బకాయిలు పడ్డాయి. మీరు చేసిన నిర్వాహకమే కదా ఈ బకాయిలకు కారణం. మీరు 15 రోజులకు ఒకసారి బకాయిలు చెల్లిస్తే ఇన్ని వేల కోట్ల బకాయిలు ఎలా ఉన్నాయి? అంతే కాదు ఇతర పనులకు సంబంధించిన 40 వేల కోట్లు బిల్లులు పెండింగ్ లో పెట్టారు’’ అని జూపల్లి అన్నారు.

‘‘మేము కొత్తగా బీర్ల కంపెనీలకు అక్కడ అనుమతి ఇవ్వలేదు. కొత్తగాపైప్ లైన్ వేయలేదు. గత ప్రభుత్వంలో నేను కూడా మంత్రిగా ఉన్నాను. ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చాను. మీ దోపిడీ స‌హించ‌లేక మీ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాను. వాటాలు పంపిణీ చేసుకుంది మీరు. మున్సిపల్ ఎన్నికలు సమీస్తున్న వేల రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’’ మంత్రి జూపల్లి అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>