epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

తెలంగాణకు అమిత్ షా రాక.. నిర్మల్‌లో భారీ సభకు బీజేపీ ప్లాన్!

కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్.. ఎన్నిక ఏదైనాసరే తెలంగాణ బీజేపీ (BJP) ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అటు అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌కు గట్టిపోటీనిస్తూ ఎక్కడా తగ్గడం లేదు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోనప్పటికీ ఓట్ బ్యాంక్‌ మాత్రం విశేషంగా పెంచుకుంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలను సైతం బీజేపీ సీరియస్‌గా తీసుకుంటోంది.

తెలంగాణ బీజేపీ మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు సైతం అమిత్‌షా (Amit Shah), నితిన్‌ నబిన్‌ ప్రచారం పర్వంలోకి దిగబోతున్నారు. దక్షిణ తెలంగాణలో ఒక సభ, ఉత్తర తెలంగాణలో ఒక సభ పెట్టే ఆలోచనలో బీజేపీ ఉంది. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ సభ, ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నిర్మల్‌లో అమిత్‌ షా సభలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>