కలం, వెబ్ డెస్క్: హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University)లో లీడర్షిప్ కోర్సు కోసం అమెరికాకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వర్సిటీలో కీలక సమావేశాలు నిర్వహించారు. కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో తరగతుల మధ్య సమయంలో అక్కడి వైస్ ప్రొవోస్ట్, హార్వర్డ్ ఎక్స్ హెడ్ ప్రొఫెసర్ డస్టిన్ టిన్స్లీతో పాటు కెన్నెడీ స్కూల్ (Kennedy School) డీన్ ప్రొఫెసర్ జెరెమీ వైన్స్టీన్ను సీఎం రేవంత్రెడ్డి కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్’ను సీఎం వారికి వివరించారు. ఈ విజన్ అమలులో భాగంగా హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తెలంగాణతో కలిసి పని చేయాలని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అలాగే పెద్ద స్థాయిలో విద్యా నాణ్యతను మెరుగుపరచేందుకు అవసరమైన విద్యా విధానాలు, ఆధునిక నైపుణ్యాల అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపై చూపే ప్రభావం వంటి అంశాలపై సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ భేటీ ఉపయోగపడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Read Also: సంజయ్ గాంధీ నుంచి అజిత్ పవార్ వరకు.. విమాన ప్రమాదాలకు బలైన ప్రముఖులు వీరే..!
Follow Us On: Sharechat


