కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించిన ‘దేవర’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్ గా ‘దేవర 2’ (Devara 2) ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఆలస్యమవుతూ వస్తుంది. దేవర 2 అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ అప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కు డేట్స్ ఇవ్వడం వల్ల దేవర 2 ఆలస్యం అవుతుంది. అయితే నిర్మాత సుధాకర్ మిక్కిలినేని (Sudhakar Mikkilineni) దేవర 2 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్ మే నుంచి దేవర2 (Devara 2) సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నామని, వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో దేవర 2 పై అంచనాలు మరింత పెరిగాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “డ్రాగన్” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Read Also: రాష్ట్రపతి భవన్ ఎట్ హోమ్‌లో మెరిసిన సమంత, ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్
Follow Us On: Instagram


