epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

అమెరికాలో మంచు తుఫాన్ విధ్వంసం.. 25 మంది మృతి

కలం, డెస్క్ : అమెరికాలో మంచు తుఫాన్ విధ్వంసం (US Snow Storm) సృష్టిస్తోంది. యూఎస్ లోని దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో మంచు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ తుఫాన్ వల్ల ఇప్పటి దాకా 25 మంది చనిపోయినట్టు అమెరికా రిపోర్టులు చెబుతున్నాయి. న్యూయార్క్ సిటీలోనే దాదాపు 8 మంది చనిపోయారు. చాలా నగరాల్లో ఒక అడుగు కంటే ఎక్కువ మంచు పేరుకుపోయింది. ప్రజలెవరూ బయటకు రాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అర్కాన్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు దాకా 2100 కిలోమీటర్ల దాకా మంచు కప్పేసింది.

ఈ మంచు తుఫాన్ (Snow Storm) వల్ల అమెరికాలో రవాణా సగానికి పైగా నిలిచిపోయింది. సోమవారం ఒక్క రోజే 8వేలకు పైగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. మంగళవారం కూడా ఫ్లైట్ల రద్దు కొనసాగుతోంది. రైళ్లు, బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ఎప్పటికప్పుడు మంచును క్లియర్ చేస్తున్నా సరే.. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో రోడ్లన్నీ మంచుతోనే కనిపిస్తున్నాయి.

Read Also: ఢిల్లీలో అఖిలపక్ష మీటింగ్.. బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>