epaper
Monday, January 26, 2026
spot_img
epaper

కెన్నడీ స్కూల్ క్లాసుల్లో సీఎం రేవంత్.. ఫస్ట్ డే తోటి స్టూడెంట్స్ తో పరిచయాలు

కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హార్వర్డ్ వర్శిటీ స్టూడెంట్‌గా మారారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ (Executive Education) ప్రోగ్రామ్‌లో భాగంగా వారం రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. తొలి రోజు క్లాసుల్లో భాగంగా ప్రోగ్రామ్, ఓరియంటేషన్ తోటి విద్యార్థులతో పరిచయం (Cohort) జరిగింది. 21వ శతాబ్దంలో నాయకత్వం అనే అంశంపై సీఎం రేవంత్ సహా పలువురు ప్రముఖులు శిక్షణ పొందుతున్నారు. అధికారం, నాయకత్వ విశ్లేషణ (Analysing Authority and Leadership) అనే అంశంపై జరిగిన సెషన్‌లో పాల్గొన్న ఆయన కేస్ట్ స్టడీస్, కన్సల్టేటివ్ గ్రూపు వర్క్స్ ఈవెంట్స్ తో వారం రోజుల పాటు బిజీగా గడపనున్నారు.

అక్కడ ప్రస్తుతం టెంపరేచర్ మైనస్ 20 డిగ్రీల్లో నమోదవుతున్నా ఉదయం 7 గంటల నుంచే క్లాసులకు అటెండ్ అవుతున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకూ కెన్నడీ స్కూల్‌లోనే వివిధ ప్రోగ్రామ్‌లలో బిజీగానే ఉంటున్నారు. బోస్టన్ తదితర పరిసర ప్రాంతాల్లో ఫెర్న్ (Fern) మంచు తుపాను బీభత్సంగా మారి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారినా విద్యార్థులంతా క్లాసులకు హాజరవుతున్నారు. రోడ్లపైనా, ఇండ్లపైనా దాదాపు రెండడగుల మేర మంచు పేరుకుపోయి చలి గజగజా వణికిస్తున్నా సీఎం రేవంత్ (Revanth Reddy) క్లాసులకు హాజరవుతున్నారు. తొలుత నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం జనవరి 31 వరకూ ఆయన హార్వర్డ్ వర్శిటీకి అనుబంధంగా ఉన్న కెన్నడీ స్కూల్ తరగతులకు హాజరై ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు రిటన్ కానున్నారు.

Read Also: ఆ నలుగురు మంత్రుల కీలక భేటీ.. ‘ఎట్ హోమ్’ నుంచి ఒకే కారులో

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>