కలం, డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) మొన్న చేతికర్ర సాయంతో నడుస్తూ కనిపించారు. దీంతో ఆయన కాలికి గాయం అయిందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. హృతిక్ కు యాక్సిడెంట్ అయిందా లేదంటే ఏదైనా దెబ్బ తగిలిందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు, మీడియాల్లో కథనాలు వచ్చాయి. వీటిపై తాజాగా హృతిక్ రోషన్ (Hrithik Roshan) క్లారిటీ ఇస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టారు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. ‘మన బాడీలో ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయేమో. మొన్న నా కాలి బటన్ పనిచేయలేదు. అందుకే నడవడానికి ఇబ్బందిగా ఉంటే చేతికర్ర వాడాను. ఇప్పుడు అంతా సెట్ అయింది’ అంటూ తెలిపారు హృతిక్ రోషన్.
మానవ శరీరంలో జరిగే ఆకస్మిక మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని.. లేదంటే తనలాగా ఇబ్బంది పడుతారంటూ తెలిపారు హృతిక్. తాను ఇప్పటికీ సీరియస్ కోర్టు గది సెట్ లో ఉన్నట్టు అనిపిస్తోందని.. త్వరలోనే అన్నీ సర్దుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తనకు కొంచెం ఇబ్బందిగా ఉంటున్నా.. తన చుట్టూ ఉన్న వారి కోసం నవ్వుతూ కనిపిస్తున్నానని తెలిపారు హృతిక్ రోషన్.
Read Also: అందుకే తప్పుకున్నా.. కమల్, రజినీ మూవీపై లోకేశ్ కనగరాజ్ క్లారిటీ
Follow Us On: Instagram


