కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) భేటీ అయ్యారు. గత 15 నెలలుగా పెండింగ్ లో ఉన్న మాధవ్ నగర్ ఆర్ఓబి (ROB) 193కి సవరించిన అదనపు 8.68 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి విన్నవించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, తక్షణమే మంజూరు ఉత్తర్వులను జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఎంపీ అరవింద్ ధన్యవాదాలు తెలిపారు.
Read Also: చెర్వుగట్టు.. జనగట్టు, కమనీయం రామలింగేశ్వరుడి కల్యాణం
Follow Us On : WhatsApp


