కలం, వెబ్ డెస్క్ : ఇండోనేషియాలో (Indonesia) ఘోర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా వరదలు పశ్చిమ జావా ప్రావిన్స్ ను ముంచెత్తాయి. వివిధ ప్రాంతాల్లో 17 మందికి మరణించగా 80 మందికిపైగా గల్లంతయ్యారు. పశ్చిమ బాండుంగ్ లోని గ్రామంలో కొండ చరియలు విరిగిపడడంతో (Landslide) 30 ఇండ్లు నేలమట్టమయ్యాయి. సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ చేస్తున్నాయి. ఇండోనేషియా స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చాలామంది చిక్కుకోగా మరణాల సంఖ్య మరింత పేరిగే అవకాశాలున్నట్లు సమాచారం. మరిన్ని కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read Also: భారత్కు అమెరికా రిపబ్లిక్ డే విషెస్..!
Follow Us On: X(Twitter)


