మాలి(Mali) దేశంలోని కోబ్రి ప్రాంతంలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ అయ్యారు. ఈ మేరకు స్థానిక భద్రతా వర్గాల తెలిపాయి. వీరంతా ఓ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థానిక కంపెనీలో పనిచేస్తున్నట్టు సమాచారం. కొందరు దుండగులు అకస్మాత్తుగా ఆ ఉద్యోగులపై దాడి చేసి.. వారిని బంధించి తీసుకెళ్లారు. సమాచారం తెలిసిన వెంటనే కంపెనీలో పనిచేస్తున్న మిగతా భారతీయులను సంఘటన తెలిసిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ కంపెనీ ప్రతినిధులు ధృవీకరించారు, కానీ బాధితుల వ్యక్తిగత వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే వీరి కిడ్నాప్ వెనుక ఎవరు ఉన్నారో ఇంకా తెలియరాలేదు. మాలి(Mali) దేశంలోని వివాదాస్పద ప్రాంతాల్లో 2012 నుంచి తిరుగుబాటుదారుల ఘర్షణలు కొనసాగుతున్నాయి. విదేశీయులను టార్గెట్ చేయడం, కిడ్నాప్ లు ఇక్కడ సాధారణమేనని తెలుస్తోంది. ఇటీవల ముగ్గురు విదేశీ పర్యాటకులు సైతం కిడ్నాప్‌నకు గురయ్యారు.
Read Also: ఆస్ట్రేలియాపై అదరగొట్టిన అభిషేక్.. రికార్డ్ బ్రేక్
Follow Us on: Instagram

