epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. ప్రియుడి భార్యకు వైరస్ ఇంజెక్షన్ ఇచ్చిన ప్రియురాలు

కలం, వెబ్ డెస్క్ : కర్నూలులో (Kurnool) రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్ అయింది. తాను ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేక మాజీ ప్రియురాలు అత్యంత దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి భార్యకు హెచ్ ఐవీ వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ వివరాలను కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. కర్నూలుకు (Kurnool) చెందిన ఓ డాక్టర్ అదోనికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. కానీ వీరిద్దరూ విడిపోయిన తర్వాత డాక్టర్ మరో మహిళా డాక్టర్ ను పెళ్లి చేసుకున్నారు. ఆమె కర్నూలు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తోంది. తాను ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాజీ ప్రియురాలు తట్టుకోలేక వారిని విడదీయాలి అనుకుంది.

మహిళా డాక్టర్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. మాజీ ప్రియురాలు మరో ముగ్గురితో కలిసి కారుతో ఢీ కొట్టింది. మహిళా డాక్టర్ కింద పడిపోగా.. సాయం చేస్తున్నట్టు వీరు నటించారు. ఆటోలో ఎక్కించే క్రమంలో మహిళా డాక్టర్ కు హెచ్ ఐవీ వైరస్ ఉన్న ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ విషయంపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>