కలం/ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం (Yedulapuram) మున్సిపాలిటీలో ఎన్నికల నగారా మోగకముందే రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇంకోవైపు బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు హస్తం గూటికి క్యూ కడుతున్నారు. శనివారం 4వ వార్డులో గులాబీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ వార్డులో పట్టున్న కీలక నేతలు అరెంపుల జ్యోతి–బ్రహ్మం దంపతులు తమ అనుచరులతో కలిసి హస్తం గూటికి చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ఈ వలసలే నిదర్శనమన్నారు. ఏదులాపురం అభివృద్ధి మంత్రి పొంగులేటితోనే సాధ్యమన్నారు.
Read Also: వాట్సాప్‌లో కొత్త ఫీచర్! ఆ మెసేజులు కూడా చదివేయొచ్చు !
Follow Us On: Pinterest


