కలం, వెబ్ డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్‌లో ప్రజా సంఘాల నాయకులు మావోయిస్టు (Maoists) రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆశ్రయం కల్పించారన్న అనుమానంతో పోలీసులు జిల్లాలో పలు చోట్ల సోదాలు చేపట్టారు. ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆశ్రయం కల్పించినట్లు పోలీసులకు సమాచారం అందింది. శనివారం ఉదయం అమ్రాబాద్‌లో (Amrabad) అడ్ల అంబయ్య, జక్కా బాలయ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. డీకేఎస్‌జడ్‌సీ సెక్రటరీగా ఉన్న సల్మాన్, ఆయన భార్య సుకుమాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Read Also: సింగరేణిపై కట్టుకథల విషపు రాతలు : భట్టి విక్రమార్క
Follow Us On : WhatsApp


