కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సిట్ విచారణ పూర్తి అయింది. అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకుని కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘నేను సిట్ విచారణకు పూర్తిగా సహకరించా. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. లోపల ఏదో జరిగిపోతోందని ప్రచారం చేశారు. కానీ అవేమీ నిజం కాదు. వాళ్లకు అన్ని విధాలుగా నేను సమాధానాలు చెప్పి బయటకు వచ్చాను. లీకులను ఎవరూ నమ్మొద్దు. మా పార్టీ నేతల వ్యక్తిత్వ హననకు బాధ్యులు ఎవరని నేను సిట్ అధికారులను అడిగాను. ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని పెట్టినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాను. సిట్ అధికారులు మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్తాను’ అంటూ చెప్పారు కేటీఆర్.
Read Also: ఎక్స్‌క్లూజివ్ : కేటీఆర్‌ను సిట్ అడిగిన ప్రశ్నలు ఇవే!
Follow Us On: Pinterest


