epaper
Friday, January 23, 2026
spot_img
epaper

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

కలం, వెబ్​ డెస్క్​ : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లో బుల్లెట్ కలకలం రేపింది. తిరుపతి నుంచి శంషాబాద్ వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్‌లో బుల్లెట్​ లభించింది. సదరు వ్యక్తి లగేజీ బ్యాగ్‌ను సీఐఎస్ఎఫ్ (CISF) అధికారులు స్కానింగ్ చేస్తుండగా, అందులో ఒక లైవ్ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే స్పందించిన అధికారులు ఆ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమాన ప్రయాణాల్లో పేలుడు పదార్థాలు, ఆయుధ సామాగ్రిని తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం కావడంతో, ఆ వ్యక్తిని తదుపరి విచారణ నిమిత్తం ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. అసలు ఆ బుల్లెట్ ఎక్కడిది? బ్యాగులోకి ఎలా వచ్చింది? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>