కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR )విచారణకు హాజరయ్యేందుకు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన నివాసం నుంచి ముందుగా తెలంగాణ భవన్ (Telangana Bhavan)కు బయలుదేరారు. మాజీ హరీశ్ రావు కూడా కేటీఆర్ వెంట ఒకే వాహనంలో బయలుదేరారు. వీరి వెంట బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద, తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ విచారణ కోసం సిట్ ప్రత్యేక ప్రశ్నలు రూపొందించుకున్నట్లు సమాచారం. ఇటీవల హరీశ్ రావు సిట్వి చారణ(SIT Inquiry)లో చెప్పిన సమాధానాల ఆధారంగా కేటీఆర్‌ను విచారించనున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం ఆయన 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకానున్నారు.


