కలం, వెబ్ డెస్క్: నేడు వసంత పంచమి(Vasant Panchami)ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిర్మల్ జిల్లా బాసర(Basara)లోని సరస్వతి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం 7 గంటల నుంచే సామూహిక అక్షరాభ్యాసాలు మొదలయ్యాయి. తల్లిదండ్రులు పిల్లలతో అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. ప్రత్యేక పూజలు, కుంకుమార్చలు భారీగా జరుగుతున్నాయి. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భారీ ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. విజయవాడ(Vijayawada) కనకదుర్గ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారు వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవిగా దర్శనం ఇస్తున్నారు. ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


