కలం, సినిమా : చిన్న సినిమాగా రిలీజైన జాతిరత్నాలు పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో.. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా (Faria Abdullah). ఫస్ట్ మూవీతోనే గుడ్ పర్ ఫార్మర్ అనిపించుకుంది. అయితే.. ఈ అమ్మడు మంచి యాక్టర్ మాత్రమే కాదు.. డ్యాన్సర్.. సింగర్.. కూడా. మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న ఈ పొడుగుకాళ్ల సుందరి ప్రేమలో పడిందట. ఈ న్యూస్ వైరల్ అయ్యింది. ఇంతకీ.. ఎవరితో ప్రేమలో పడింది..?
జాతి రత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఫరియా.. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. చిట్టి పాత్రలో.. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. పొడుగు కాళ్ల సుందరిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు జాతి రత్నాలు తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, బంగార్రాజు, రావణాసుర, కల్కి 2 తదితర చిత్రాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించింది. మత్తు వదలారా 2 సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ అమ్మడు నటిగానే కాకుండా మంచి డ్యాన్సర్ గా కూడా రాణిస్తుండడం విశేషం.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ పొడుగుకాళ్ల సుందరి (Faria Abdullah) ప్రేమలో పడిందని ఎవరో చెప్పడమో.. ఇంకెవరో రాయడమో కాదు.. స్వయంగా ఈ అమ్మడే ఓ ఇంటర్ వ్యూలో బయటపెట్టింది. తన రిలేషన్ షిప్ పై ఓపెన్ గా చెప్పేసింది. తాను ఓ హిందు అబ్బాయితో డేటింగ్ లో ఉన్నానని.. ఇండస్ట్రీలో ఉంటూ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తున్నాను అంటే దానికి తన లవర్ అందిస్తున్న ప్రోత్సాహమే కారణమని అసలు విషయం బయటపెట్టింది. తన మనసు దోచుకున్న ప్రియుడు యంగ్ కొరియోగ్రాఫర్ అని చెప్పింది. అయితే.. అతని పేరేంటో..? పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో అనేది.. మాత్రం చెప్పలేదు.


