epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

ఏపీలో క్రెడిట్ చోరీ రాజకీయం.. ఎవరికి లాభం..?

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ప్రస్తుతం క్రెడిట్ చోరీ రాజకీయాలు నడుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీలో ఎలాంటి ప్రాజెక్టు పూర్తయినా.. లేదంటే పనులు కంప్లీట్ అయినా సరే వైసీపీ ఇది తమ హయాంలోనే 90 శాతం కంప్లీట్ అయిందని చెప్పుకోవడం.. ఇటు కూటమి ప్రభుత్వం తామే స్పీడ్ గా పనులు చేసి కంప్లీట్ చేశామని చెప్పుకోవడం కనిపిస్తోంది. ఆ మధ్య విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు ముందు వైసీపీ దాంతో లాభం లేదని చెప్పింది. ఆ తర్వాత మాజీ సీఎం జగన్ (Jagan) మీడియా ముందుకొచ్చి తన హయాంలోనే గూగుల్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్ల కోసం ప్రతిపాదనలు, చర్చలు జరిగాయని.. ఇప్పుడు సీఎం చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదన్నారు. ఇదే విషయంపై కూటమి ప్రభుత్వం స్పందిస్తూ.. అసలు జగన్ హయాంలో ఒక్క ఎంవోయూ కూడా జరగలేదని.. సీఎం చంద్రబాబు (Chandrababu), మంత్రి నారా లోకేష్‌ గూగుల్ ప్రధాన ఆఫీస్ కు వెళ్లి ఒప్పించారని చెప్పింది.

ఎయిర్ పోర్టు, గ్రీన్ అమ్మోనియాపై..

మొన్న భోగాపురం ఎయిర్ పోర్టు ఫస్ట్ ట్రయల్ పూర్తయితే.. తన హయాంలోనే దాదాపు పనులన్నీ అయిపోయాయని జగన్ అన్నారు. సీఎం చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ.. అసలు జగన్ హయాంలో ఎయిర్ పోర్టుకు ఒక్క నిర్మాణ పని కూడా జరగలేదని.. ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేసిన చరిత్ర జగన్ (Jagan) కే ఉందని ఆరోపించారు. కేంద్ర విమానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటం వల్లే భోగాపురం ఎయిర్ పోర్టు పనులు స్పీడ్ గా జరిపి కంప్లీట్ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు.

దీని తర్వాత మొన్న గ్రీన్ అమ్మోనియా (Green Ammonia) కంపెనీ ప్రారంభం అయితే.. ఆ క్రెడిట్ కూడా తనదే అన్నారు వైసీపీ అధినేత. తాము ఏ కంపెనీ తీసుకొచ్చినా.. ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేసినా జగన్ క్రెడిట్ చోరీకి రెడీగా ఉంటున్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు తీసుకొచ్చిందే తాము అంటూ చెప్పింది కూటమి.

భూముల రీ సర్వే అంటూ..

ఈ రోజు సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీలో భూములను రీ సర్వే చేసిన క్రెడిట్ తనదే అన్నారు. 1920ల నాటి బ్రిటిష్ కాలంలో ఉన్న రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయని.. తమ ప్రభుత్వంలోనే వాటిని రీ సర్వే చేసి భూముల మధ్య హద్దురాళ్లు పాతామన్నారు జగన్. దానికి వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. తాను పూర్తి చేసిన ప్రాజెక్టుకు ఇప్పుడు సీఎం చంద్రబాబు రంగులు అద్ది కొత్త ప్రాజెక్టు అంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆరోపించారు.

క్రెడిట్ కోసం పోటీ..

అటు కూటమి నేతలు మాట్లాడుతూ… వైసీపీ హయాంలో ఫొటోలు వేసుకుని పబ్బం గడిపారు తప్ప పెద్దగా చేసిందేమీ లేదంటున్నారు. ఇప్పుడు తాము వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు భూ సమస్యలు లేకుండా చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇలా ప్రతి దాంట్లో అటు కూటమి, ఇటు వైసీపీ నడుమ క్రెడిట్ చోరీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ వైసీపీ అయినా.. కూటమి అయినా.. ఏదైనా ప్రాజెక్టు పూర్తయితే వెంటనే తమ క్రెడిట్ అని చెప్పుకోడానికి పోటీ పడుతున్నాయి. మంచి జరిగితే మా క్రెడిట్ అంటున్న పార్టీలు.. ఏదైనా అనుకోని ఘటన జరిగితే దాన్ని అవతలి పార్టీ మీదకు తోసేయడం పరిపాటిగా మారిపోయింది.

కానీ ఏ ప్రభుత్వం ఒక పనిని లేదా ప్రాజెక్టును స్టార్ట్ చేసినా.. తర్వాత వచ్చే ప్రభుత్వాలు వాటిని పూర్తి చేయాల్సిందే. ఎవరు స్టార్ట్ చేసినా.. ఎవరు పూర్తి చేసినా అంతిమంగా ప్రజలకు మేలు జరగాలి కదా. మేమే చేశాం.. మేమే కట్టాం అంటే ప్రజల ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసమే అనేది ఈజీగా అర్థం అవుతుంది.

Read Also: ఏపీలో భూములున్నవారికి గుడ్ న్యూస్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>