epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

భారత్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌పై బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: త్వరలో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ (Bangladesh) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ కప్ కోసం తమ జాతీయ జట్టు భారతదేశానికి వెళ్లదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతర్గత బోర్డు సమావేశం తర్వాత గురువారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ, బీసీబీ డైరెక్టర్లతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుండి వైదొలగితే.. ఫిబ్రవరి 7న జరగబోయే మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను భర్తీ చేయబోతున్నారు. ఈ నిర్ణయంపై బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం రియాక్ట్ అయ్యారు.

“మేం ఐసీసీ (ICC)తో టచ్‌లో ఉన్నాం. ప్రపంచ కప్ ఆడాలనుకుంటున్నాం. కానీ ఇండియాలో ఆడం. ఐసీసీ బోర్డు సమావేశంలో అనేక విషయాలపై చర్చించాం. ఇండియా నుంచి మ్యాచ్‌లను వేరే చోటికి మార్చాలన్న మా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ప్రపంచ క్రికెట్ స్థితి గురించి మాకు అంతగా తెలియదు. కానీ మాలాంటి దేశం వరల్డ్ కప్‌లో ఆడకపోతే అది కచ్చితంగా ఐసీసీ వైఫల్యం” అని బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>