కలం, వెబ్ డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులో (Alair) గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్‌ను వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను జనగామకు చెందిన సాజుద్దీన్, నితిన్ రెడ్డిగా గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సాజుద్దీన్, నితిన్ రెడ్డి హైదరాబాద్ నుంచి జనగామ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: గ్రాషా మేషల్కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి
Follow Us On: Youtube


