కలం, వెబ్ డెస్క్: హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్ భవిష్యత్తులో దేశానికి ప్రధాని అవుతారని నిధి అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిధి ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను ఆంధ్రా, తెలంగాణలో దేవుడితో సమానంగా చూస్తారని చెప్పారు. పవన్ చాలా తెలివైన వ్యక్తి అని, చాలా ధైర్యవంతుడు అని కొనియాడారు. పవన్ ప్రజల కోసం ఎవరినైనా ప్రశ్నించి, ఎదురిస్తాడన్నారు. ఆయన పార్టీ పెట్టి ఒంటరిగా ఏళ్ల తరబడి ప్రజల కోసం పోరాడారని తెలిపారు. ఆయన సినిమాలు హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వసూళ్లు రాబడతాయన్నారు. సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్నారని తెలిపారు.
నిధి అగర్వాల్ పవన్‌తో హరిహర వీరమల్లు అనే సినిమా చేశారు. ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విడుదలైన సమయంలో కూడా నిధి పవన్ ను (Pawan Kalyan) పొగడ్తలతో ముంచెత్తింది. ప్రస్తుతం నిధి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సదరు వీడియోను పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: పసుపు పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
Follow Us On: Sharechat


