కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ల ఫామ్‌పై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. టైటిల్‌ను నిలుపుకోవాలంటే భారత బ్యాటింగ్ విభాగం స్ట్రాంగ్‌గా ఉండాలన్నాడు. ప్రస్తుతం భారత్‌కు సూర్య ఫామ్ కీలకమని ఆయన తెలిపాడు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ముందు రోహిత్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. గాయంతో దూరమైన తిలక్ వర్మ నేపథ్యంలో టాప్ ఆర్డర్‌లో సూర్యకుమార్ పాత్ర కీలకంగా మారింది. సూర్య బాగా ఆడకపోతే బ్యాటింగ్ లైనప్ ప్రభావితమవుతుందని రోహిత్ పేర్కొన్నారు. అయితే సూర్య కెప్టెన్సీపై Rohit Sharma ప్రశంసలు కురిపించాడు. ఆటపై అవగాహన ఉన్న లీడర్‌గా సూర్యను అభినందించాడు.
సూర్య ఫామ్‌లోకి రావాలి: రహానే
2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడన్న నమ్మకాన్ని మాజీ భారత కెప్టెన్ అజింక్య రహానే వ్యక్తం చేశాడు. ఒత్తిడి లేకుండా సరళంగా ఆడితే సూర్య తన సహజ ఆటను తిరిగి పొందుతాడన్నాడు. ఇటీవల సూర్య ఫామ్ తగ్గిందని రహానే పేర్కొన్నాడు. అతని సామర్థ్యానికి ప్రస్తుత గణాంకాలు తక్కువగా ఉన్నాయన్నాడు. బ్యాట్స్‌మన్‌గా తనపై తానే అధిక ఒత్తిడి పెంచుకుంటున్నాడని అభిప్రాయపడ్డారు. సరళంగా ఆడుతూ తన ఆటపై నమ్మకం ఉంచాలని సూచించాడు.
సూర్య సిద్ధత స్థాయి చాలా బాగుందని రహానే చెప్పారు. మైదానంలో అతని ధోరణి తీవ్రత ప్రశంసనీయమని పేర్కొన్నాడు. సూర్య ఎక్కువసేపు క్రీజ్‌లో నిలబడితే భారత్ మంచి ఫలితాలు సాధిస్తుందని తెలిపాడు. ఇదిలా ఉండగా సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ తొలి టీ20 మ్యాచ్‌లో బుధవారం జనవరి 21న నాగ్‌పూర్‌లో బరిలోకి దిగనున్నాడు.


