కలం, వెబ్ డెస్క్ : పెండింగ్ లో ఉన్న మెట్రో ఫేజ్ – 2 (Metro Phase 2) ప్రాజెక్టును పలుకుబడిని ఉపయోగించి వీలైనంత త్వరగా ఆమోదింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) లేఖ రాశారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో సీఎం విజ్ఞప్తి చేశారు.
మెట్రో ఫేజ్ –2 మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం చర్యలు జరుపుతుందని పేర్కొన్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కలిసినప్పుడు జరిగిన చర్చలపై కిషన్ రెడ్డికి లేఖలో రేవంత్ రెడ్డి వివరించారు. మెట్రో మంజూరును వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనకు అనుగుణంగా సీఎస్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీని నామినేట్ చేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
సంయుక్త కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూస్తున్నామని జనవరి 15న కిషన్ రెడ్డికి రాసిన లేఖను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కమిటీ కూర్పుపై ఇప్పటికే కేంద్రానికి తెలియజేశామన్నారు. ఎంతో కాలం పెండింగ్ లో ఉన్న మెట్రో ఫేజ్ – 2 (Metro Phase 2) ప్రాజెక్టు కు మీ పలుకుబడిని ఉపయోగించి త్వరితగతిన ఆమోదింపజేయాలని కిషన్ రెడ్డికి రాసిన లేఖలో సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థించారు.
Read Also: ఏఐతో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Pinterest


