epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

మొబైల్ కు బానిసైన యువతి.. తల్లి మందలించడంతో ఆత్మహత్య

కలం, మెదక్ బ్యూరో : ఆన్లైన్ బెట్టింగ్ (Online Betting) లే కాదు.. మొబైల్ గేమ్స్( Mobile Games) కుడా ప్రాణాలను తీస్తున్నాయి. మొబైల్ లో గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు అన్నందుకు యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ (Medak) జిల్లాలో చోటుచేసుకుంది. హావేలిఘనపూర్ మండలం ముత్తాయిపల్లికి చెందిన 19 ఏళ్ల శిరీష కొన్ని రోజులుగా ఎప్పుడు చూసినా ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉండేది.

తరచూ  మొబైల్ వాడొద్దని తల్లిదండ్రులు చాలాసార్లు హెచ్చరించారు. ఎన్నిసార్లు చెప్పినా  మొబైల్ గేమ్స్ కు బానిసైన శిరీష పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఉండేది.  శిరీష తన  తీరు మార్చుకోకపోవడంతో తల్లి గట్టిగా మందలించింది. దీంతో ఆ యువతి మనస్తాపానికి గురై ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శిరీష మృతి చెందింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>