కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అంటే పర్యాటకం, వ్యవసాయం, చారిత్రక అంశాలే కాదు.. గొప్ప ఆచార వ్యవహారాలు కూడా. రాష్ట్రంలో జరిగే ప్రతి పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు (Medaram Jatara) ఎంత ప్రాధాన్యం ఉందో.. నాగోబా జాతరకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. ఈ రెండు జాతరలు ఒకేసారి జరుగుతుండటంతో తెలంగాణలో ఎటుచూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ కుంభమేళాగా మేడారం ప్రసిద్ధి. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర (Medaram) ప్రారంభం కానుంది. 10 రోజుల ముందుగానే మేడారంలో భక్తుల సందడి మొదలైంది. మేడారం గ్రామానికి భారీగా తరలివస్తూ మొక్కలు చెల్లించుకుంటున్నారు. ఎంత రద్దీ ఉన్నా తొక్కిసలాట జరగని మహాద్భుత వేడుక ఇది. ఇక నాగోబా (Nagoba) జాతరకి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. కేస్లాపూర్‌లో ఘనంగా నాగోబా జాతర వేడుకలు జరుగుతున్నాయి. ఈ నెల23న బేతాల్ పూజతో నాగోబా జాతర ముగియనుంది.
Read Also: కృష్ణంరాజు బర్త్ డే.. ఈ పేషెంట్లకు శుభవార్త
Follow Us On: X(Twitter)


