కలం, వెబ్ డెస్క్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా (BJP National President) నితిన్ నబిన్ (Nitin Nabin) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త సారథి నామినేషన్ కార్యక్రమం బీజేపీ ప్రధాన కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు. ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ గా కే.లక్ష్మణ్ వ్యవహరించారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, సీనియర్ నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, కిరణ్ రిజిజు, పార్టీ చీఫ్ జేపీ నడ్డా హాజరయ్యారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడి గా నితిన్ నబిన్ను (Nitin Nabin) ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కేవలం ఒక్క నామినేషన్ రావడంతో నితిన్ నబిన్ ఏకగ్రీవం లాంఛనం కానుంది. కొత్త చీఫ్ ఎంపికకు సంబంధించి రేపు (మంగళవారం) పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమయిన కొన్ని రోజులకే పార్టీ అధినేతగా నితిన్ నబిన్ నియామకం అయ్యారు. కొత్త అధ్యక్షుడి రాకతో బీజేపీలో నయా జోష్ నిండనుంది.
Read Also: ఈవీఎంలు కాదు.. ఈసారి అక్కడ బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు
Follow Us On : WhatsApp


