కలం, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లా వినుకొండ (Vinukonda) బస్టాండ్ వద్ద తీవ్ర ప్రమాదం జరిగింది. బస్సు ఎక్కే క్రమంలో ప్రయాణికుల మధ్య తోపులాట జరిగి తొక్కిసలాట (Stampede) జరిగింది. సంక్రాంతి సెలవులు ముగియడంతో పల్లెటూర్ల నుంచి పట్టణాలకు ప్రజలు ఒకేసారి పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణం అయ్యారు. వినుకొండ బస్టాండ్ లో విజయవాడ బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు. జనం ఒక్కసారిగా బస్సు వద్ద గుమిగూడటం.. తోపులాట జరగడంతో తొక్కిసలాట జరిగి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
బస్సులు సరిపోక ప్రయాణికుల మధ్య ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు అధికారులు. ఏపీలో రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, భీమవరం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో బస్టాండుల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బస్సలు కిక్కిరిసిపోతున్నాయి. ఇంకా వేల మంది బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు.
Read Also: మహిళలతో కర్ణాటక డీజీపీ అసభ్య ప్రవర్తన.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
Follow Us On : WhatsApp


